Breaking News విద్య

ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు

143 Views

మార్కెటింగ్ ఉద్యోగాలు శనివారం డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ నీల రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ  పూర్తి చేసి 35 సం లోపు వయసు ఉన్న అభ్యర్థులకు నెలకు  రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం  ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాఫీలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని F-16 మొదటి అంతస్తు లో శనివారం (24-02-2024) ఉదయం 11.00 గంటలకు చేపట్టనున్న మినీ జాబ్ మేళాకు హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి కోరారు. మరిన్ని వివరాలకు 99121 78932, 99633 57250, 99853 46768 నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.

No Slide Found In Slider.

Poll not found