*అమరవీరుల సమాధుల మీద కోటలు కట్టిన కెసిఆర్ కుటుంబం*
*అమరవీరుల ఆశయాలను నెరవేర్చుదాం ,సామజిక తెలంగాణ సాధిద్దాం*
*రజాకార్లను తలపిస్తున్న కెసిఆర్ పాలనా*
*సిద్దిపేట న్యూస్*
తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన జాయింట్ యాక్షన్ కమిటి ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్ లో డీసీసీ ప్రధాన కార్యదర్శి ,జేఏసీ జిల్లా కన్వీనర్ మీసం నాగరాజ్ యాదవ్ అధ్యక్షతన సమావేశం చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా జేఏసీ చైర్మన్ మాజీ ఎమ్ ఎల్ ఏ మృత్యుమ్ జయం ,జేఏసీ ప్రణాళిక అమలు కమిటీ చైర్మన్ మాజీ ఎమ్ఎల్ సి రాములు నాయక్ లు పాల్గొని మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో రజాకార్ల పాలనా కొనసాగుతుందని ,రాష్ట్రము ఏర్పాటు జరిగితే నిధులు నియామకాలు నీరు వస్తుందని కొట్లాడితే కేవలం కెసిఆర్ కుటుంబం పాలు తెలంగాణ రాష్ట్రం అయిందని మండిపడ్డారు .రాష్ట్రము ఏర్పాటు అయితే సామజిక తెలంగాణ ఏర్పాటు అవుతుంది అని అనుకుంటే రజాకార్ల పాలన కొనసాగుతుందన్నారు .కోట్ల రూపాయల రాష్ట్ర సంపదను కెసిఆర్ కుటుంబం దోచుకుంటూ ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారని మండిపడ్డారు .దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రముగ తెలంగాణను తయారుచేశారన్నారు .ఉద్యమంలో అమరవీరులైన కుటుంబాలను కెసిఆర్ కుటుంబం విస్మరించిందన్నారు .మంత్రి హరీష్ రావు ఆర్థిక మంత్రి అయినాక కోట్లరూపాయల అప్పులు తెచ్చి ,రాష్ట్ర సంపదను దోచుకున్నారన్నారు .ఉద్యమ సమయంలో మంత్రి హరీష్ రావు యువతను రెచ్చగొట్టి ,పేట్రోల్ తో ఆత్మహత్య డ్రామాలాడి అగ్గిపెట్టె దొరకలేదని డ్రామాలాడి యువతను రెచ్చగొట్టి యువత ఆత్మహత్యలకు కారణమయ్యాడన్నారు .సిద్దిపేటలో అవినీతి రాజ్యంమేలుతుందన్నారు .అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టుతూ అణచివేస్తున్నాడన్నారు .సిద్దిపేటను మామ అల్లుండ్లు దోచుకునే అడ్డాగా తాయారు చేసుకున్నారని మండిపడ్డారు .రాబోయే రోజుల్లో హరీష్ రావు ను కేసీర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు .అమరవీరుల ఆశయాలకు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగాఉండాలని పిలుపునిచ్చారు .బి ఆర్ ఎస్ సర్కారును గద్దె దించాలని కోరారు . ఈ కార్యక్రమం లో జేఏసీ నాయకులు మెట్టు సూర్య ప్రకాష్, తులాజా రెడ్డి, ప్రభాకర్, రియాజ్, ప్రపులు రాంరెడ్డి, అన్నాళదాస్ వేణు,కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు పద్మ అక్క,కాంగ్రెస్ చిన్నకోడూరు మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్, ఉప అధ్యక్షులు సంధబోయిన పర్శరాం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉడుత జయంత్, యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్,nsui అధ్యక్షులు ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు కాలువ జగన్, సెక్రటరీలు మహేందర్, చిన్న మహేందర్ సీనియర్ నాయకులు సిద్ధుల కుమార్ స్వామి, మీసం రాజు,జక్కుల నాగరాజు, పండుగ శెంకర్, బాబు,పొట్ల అజయ్,వేణు, అరుణ్, ఇర్మల్ల ఎల్లయ్య, బాపురెడ్డి,పసుపుల బాబు, నిమ్మల వినయ్, గుండు కాడి నరేష్,తదితరులు పాల్గొన్నారు
