జీవో 69/22ను రద్దు చేయాలి విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం డిమాండ్ కొత్త బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తహశీల్దార్ కు వినతిపత్రం చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఆగష్టు 25 : కలప వృత్తి దారులకు వ్యతిరేకంగా వచ్చిన జీఓ 69/22 ను వెంటనే రద్దు చేయాలని ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం డిమాండ్ చేసింది ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి తహసిల్దార్ జయంత్ కు వినతి పత్రం అందజేశారు , విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కలప ఆధారిత కుటీర పరిశ్రమలకు 55 జీవో యాధవిదిగా కొనసాగించాలని , 10 హెచ్‌పీ వరకు అనుమతివ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కలప వృత్తి పరిరక్షణకు కృషి చేయాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతిపత్రం ను తహశీల్దార్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం
జిల్లా కోశాధికారి కొలనూరి శంకర్ . ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు చెలిమెల ఆంజనేయులు చారి , ఉపాధ్యక్షులు పిన్నోజు శ్రీధర్ చారి , మోగులోజు కిష్టయ్య చారి , కాంభోజ దేవరాజు చారి , ప్రచారకార్యధర్షి శ్రీరామోజు దీవరాజు ప్జిఆ
పాలోజి శంకర్ చక్రి , కోత్తపెల్లి ఆంజనేయులు , మారాజు లక్ష్మీనారాయణ , మరోజు రాజు , నల్లనాగుల రామాచారి , దేవేందర్ , బ్రహ్మ చారి ,పెంటయ్య , దాసు న్యాలపెల్లి సతీష్ , తదితరులు పాల్గొన్నారు
