అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు వినూతనగా ఆవాలను ఉపయోగించి స్త్రీ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి బుధవారం నాడు రామకోటి కార్యాలయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలో స్త్రీని సృష్టించాడు. జననం నీవే, గగనం నీవే, సృష్టివి నీవే, కర్తవు నీవే అందుకే స్ర్రీని దేవతతో పోల్చడం మన భారత సాంప్రదాయం అన్నారు. నేను చిత్రించిన ఈ చిత్రం కంటికి రెప్పలా కాపాడే స్ర్రీ మూర్తులందరికి అంకితంఅన్నారు. గత సంవత్సరం తలంబ్రాలతో చిత్రించానన్నాడు.
