నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు గత కొన్ని రోజుల క్రితం వేల్పూర్ మండల వైద్యాధికారికి పదోన్నతి పై మరోచోటికి స్థానచలనం చెందారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కి వచ్చే రోగుల పరిస్థితి వైద్యం అందక అగమ్య గోచరంగా మారింది నిరుపేదలకు అనారోగ్యం గురై వస్తే వైద్యం చేసేది ఎవరని 10 మంది రోగులకు ఒకే స్టాఫ్ నర్స్ మాత్రమే పని చేయడం వలన వేల్పూర్ గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు సీజనల్ వ్యాధులు ప్రబలితే మరెక్కడ చూయించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు ఆరోగ్య కేంద్రానికి వచ్చి గంటల తరబడి పడి కాపులు కాస్తున్నామని చెబుతున్నారు నిజామాబాద్ జిల్లా వైద్యాధికారి పట్టించుకోని వేల్పూర్ మండల ఆరోగ్య కేంద్రానికి వైద్యాధికారిని సత్వరమే నియమించాలని కోరుతున్నారు లేదంటే మంత్రి ప్రశాంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని హెచ్చరించారు
