Breaking News

100 Views

*మంచిర్యాల నియోజకవర్గం*

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీ వార్డు నెంబర్ 6 లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోని వాకర్స్ ని మరియు బాయ్స్ హై స్కూల్ మైదానంలోని వాకర్స్ ని, మరియు మంచిర్యాల మార్కెట్ ముక్కారం చౌరస్తాలోని లేబర్ వర్కర్స్ ని, మరియు ఓవర్ బ్రిడ్జి దగ్గర లేబర్ వర్కర్స్ ని కలిసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రస్తుత పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ  కొప్పుల ఈశ్వర్ , మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మరియు ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్