చందుర్తి – జ్యోతి న్యూస్
75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా చందుర్తి మండలం లోని లింగంపేట గ్రామంలో మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మువ్వన్నెల జెండా ఎగురవేసి వందనం చేశారు. జాతీయగీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ మాట్లాడుతూ… మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంచి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం కోసం పోరాడిన సమరయోధుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల రేణుక, మెంగళి కవిత, కాముటం స్వప్న, తీగల లక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.