బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో 15,500/-ఆర్ధిక సహాయం
ఏటూరునాగారం,సెప్టెంబర్ 06
ఏటూరునాగారం మండలంకు చెందిన నిరు పేద మహిళా యండి హసీనాకు ఆపరేషన్ నిమిత్తం ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ దాతల సహకారంతో 15,500/- రూపాయలు సహా యం అందజేశారు.బ్లడ్ డోనర్ సయ్యద్ వహీద్ బాధిత మహిళా నివాసంకు వెళ్లి ఆమెను పరామర్శించి ఆమెకు దాతల ద్వారా వచ్చిన డబ్బు లు అందచేయటం జరిగింది. ఈ సందర్బంగా హసీనా దా తలు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.