Breaking News

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

87 Views

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

21 అక్టోబర్ ,

ఇల్లంతకుంట ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీ కోసం కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై పాల్గొని మాట్లాడుతూ.

ఎన్నికల కమిషన్ ఎన్నికలను ప్రకటించినoదున రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనవచ్చని, ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎన్నికల్లో వివిధ పార్టీల నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు గానీ, ప్రజలు ఓటు హక్కు ఉపయోగించేటప్పుడు గానీ ఎవరైనా ఆటంక పరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఏఎస్ఐ మోతిరామ్, హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుళ్లు తిరుపతి, శ్రీనివాస్, జీవన్ లు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *