రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడుగా దుంపెన రమేశ్,ప్రధాన కార్యదర్శిగా కట్ల శ్రీనివాస్ లు ఎన్నిక”
రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం మండలాల కమిటీ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కమిటీ ఎన్నికలు రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి వాసరవేణి పర్శరాములు ఆధ్వర్యంలో కార్యవర్గ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.
ఈ ఏకగ్రీవ ఎన్నికలలో *ఎల్లారెడ్డిపేట మండలశాఖ అధ్యక్షుడుగా రచయిత దుంపెన రమేశ్,ప్రధాన కార్యదర్శిగా రచయిత కట్ల శ్రీనివాస్* గార్లు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడుగా వాసరవేణి దేవరాజు, కోశాధికారిగా పెరుమాండ్ల రాజయ్య, కార్యవర్గ సభ్యులుగా గంప నాగేంద్రం , కె.మురళి, బి.సంజీవ్, జి.తిరుపతి,ఎస్.రవీందర్లు ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారిగా వాసరవేణి పర్శరాములు వ్యవహరించారు.ఎన్నికైన ప్రతినిధులు బాధ్యతలు నిర్వహిస్తామని తెల్పారు.
