ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో గత రెండు నెలల క్రితం అనారోగ్యంతో మెదడులో రక్తం గడ్డకట్టి మొగులోజు విష్ణు ప్రసాద్ చారి మరణించగా వారి కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోవడంతో వారి కుటుంబా దీనస్థితిని తెలుసుకుని తమ వంతు సాయం అందించడానికి ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘ సభ్యులు 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు దుంపటి జనార్ధన్ చారి జిల్లా కోశాధికారి ధూమాల శంకర్ చారి ఎల్లారెడ్డిపేట మండలం అధ్యక్షుడు చెలిమెల ఆంజనేయులు చారి ప్రధాన కార్యదర్శి వంగాల వసంత్ కుమార్ చారి ఉపాధ్యక్షుడు శ్రీధర్ చారి, కిష్టయ్య చారి, వేణుగోపాల్ చారి, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీరామోజు దేవరాజ్ చారి అల్మాస్పూర్ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
