జిల్లాలో మావోయిస్టులు మాకొద్దు అంటూ..వెలసిన కరపత్రాలు
ములుగు జిల్లా:అక్టోబర్ 02
జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం, పాలెం, పాత్రాపురం గ్రామ శివారులో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్య వేదిక పేరిట కరపత్రాలు వెలిశాయి.
మాకొద్దు మావోయిస్టు పార్టీ, మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి, కరపత్రాల్లో పేల్కొన్నారు. అయితే కరపత్రాల వెనక పోలీసులు ఉన్నట్టు ప్రజా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరపత్రాలపై మావోల రియాక్షన్ ఎలా ఉండబోతోందో అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…
