Breaking News

చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 22 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ని ఎస్ ఆర్ చికెన్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి కోళ్ళను దొంగిలించే ప్రయత్నం చేస్తున్న ఎల్లారెడ్డిపేట కెసిఆర్ కాలనీ కి చెందిన ఓ వ్యక్తి ని ఎల్లారెడ్డిపేట కు చెందిన ఇద్దరు యువకులు పట్టుకొనే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తి కొడవలి తో దాడిచేశాడని తెలిసింది పారిపోయే యత్నం చేయగా గ్రామస్థులు పట్టుకొని దేహాశుద్ది చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం ఈ సంఘటన దొరికితే దొంగ లేకుంటే దోర అన్న చందంగా ఉంది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్ ఆర్ చికెన్ సెంటర్ వద్ద గల కోళ్లను భద్రపరిచే జాలి నుంచి ఎల్లారెడ్డిపేట కు చెందిన వ్యక్తి సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దొంగిలించే ప్రయత్నం చేస్తుండగా ఎల్లారెడ్డిపేట కు చెందిన యువకులు పుల్లయ్య గారి బాల సాయి గౌడ్, గంట మధు గౌడ్ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు, వారిపై కొడవలి చేత బట్టుకొని ఉన్న ఆయన దాడికి ఉపక్రమించాడు, ఈ సంఘటనలో తప్పించుకునే క్రమంలో బాల సాయి గౌడ్ కు ఎడమచేతి కి గాయం అయింది వెంటనే అక్కడే ఉన్న పుల్లయ్య గారి వినీథ్ గౌడ్ , గంట శ్రీనివాస్ గౌడ్ , కటికే రవి , నాగుల తిరుపతి గౌడు , సలావుద్దీన్ , గంట కూశా గౌడ్ చందుపట్ల భగవంత్ రెడ్డిలు ఆ వ్యక్తి ని పట్టుకొని దేహశుద్ధి చేశారు, అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించామని వారు తెలిపారు, అదేవిధంగా ఎల్లారెడ్డి పేట కు చెందిన బండారి బాలన్న పశువుల పాకలో 16 వంద రూపాయలు విలువ చేసే సెల్లు, ఒక కొడవలి ,ఒక ఎం సి క్వార్టర్ మధ్యాన్నీ అదే వ్యక్తి అపహరించాడని బాలన్న తెలిపారు, గత వారం రోజుల నుండి గ్రామంలో ఆ వ్యక్తి పిచ్చి పాటిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు, ఆదివారం రాత్రి అపహరణకు గురైన పోచమ్మ తల్లి పురాతన రాతి విగ్రహం కూడా ఈ వ్యక్తే దొంగలించి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు,

228 Views

చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 22 :

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ని ఎస్ ఆర్ చికెన్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి కోళ్ళను దొంగిలించే ప్రయత్నం చేస్తున్న ఎల్లారెడ్డిపేట కెసిఆర్ కాలనీ కి చెందిన ఓ వ్యక్తి ని ఎల్లారెడ్డిపేట కు చెందిన ఇద్దరు యువకులు పట్టుకొనే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తి కొడవలి తో దాడిచేశాడని తెలిసింది
పారిపోయే యత్నం చేయగా గ్రామస్థులు పట్టుకొని దేహాశుద్ది చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం
ఈ సంఘటన దొరికితే దొంగ లేకుంటే దోర అన్న చందంగా ఉంది
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్ ఆర్ చికెన్ సెంటర్ వద్ద గల కోళ్లను భద్రపరిచే జాలి నుంచి ఎల్లారెడ్డిపేట కు చెందిన వ్యక్తి సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దొంగిలించే ప్రయత్నం చేస్తుండగా ఎల్లారెడ్డిపేట కు చెందిన యువకులు పుల్లయ్య గారి బాల సాయి గౌడ్, గంట మధు గౌడ్ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు, వారిపై కొడవలి చేత బట్టుకొని ఉన్న ఆయన దాడికి ఉపక్రమించాడు,
ఈ సంఘటనలో తప్పించుకునే క్రమంలో బాల సాయి గౌడ్ కు ఎడమచేతి కి గాయం అయింది వెంటనే అక్కడే ఉన్న పుల్లయ్య గారి వినీథ్ గౌడ్ , గంట శ్రీనివాస్ గౌడ్ , కటికే రవి , నాగుల తిరుపతి గౌడు , సలావుద్దీన్ , గంట కూశా గౌడ్ చందుపట్ల భగవంత్ రెడ్డిలు ఆ వ్యక్తి ని పట్టుకొని దేహశుద్ధి చేశారు,
అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించామని వారు తెలిపారు,
అదేవిధంగా ఎల్లారెడ్డి పేట కు చెందిన బండారి బాలన్న పశువుల పాకలో 16 వంద రూపాయలు విలువ చేసే సెల్లు, ఒక కొడవలి ,ఒక ఎం సి క్వార్టర్ మధ్యాన్నీ అదే వ్యక్తి అపహరించాడని బాలన్న తెలిపారు, గత వారం రోజుల నుండి గ్రామంలో ఆ వ్యక్తి పిచ్చి పాటిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు,
ఆదివారం రాత్రి అపహరణకు గురైన పోచమ్మ తల్లి పురాతన రాతి విగ్రహం కూడా ఈ వ్యక్తే దొంగలించి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు,

Oplus_131072
Oplus_131072
Anugula Krishna