Breaking News

108 Views

ఇంటి పెద్దగా మారిన సామాజిక కార్యకర్త….వివాహానికి పుస్తె మెట్టెలు అందజేత*……….
తన కుమార్తె వివాహాము కోసం బంధుమిత్రులకు వారి అవసర నిమిత్తం డబ్బులు తీసుకుని వివాహనికి అందజేస్తామని చెప్పి కూతురు వివాహాం దగ్గరికి వస్తున్న డబ్బులు అందకపోవడంతో కూతురు వివాహాన్ని ఎలా చేయాలి అని బెంగపడి ఇటీవల గుండెపోటుతో చనిపోయాడు.వివరాలు ఇలా ఉన్నాయి.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో గల బాబా నగర్ కు చెందిన సందారికారి గంగాధర్ అలియాస్ మీసాల గంగన్న-సుగుణ ల కూతురు అక్షర(స్వప్న) వివాహం ఓటరికారి సుశీల-కీర్తిశేషులు పోశెట్టి ల కుమారుడు ప్రశాంత్ తో ఇటీవల వివాహం నిశ్చితార్థం జరిగింది. డబ్బులు తీసుకున్న బంధుమిత్రులు ,కుటుంబ సభ్యులు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో గంగన్న బెంగ పడి చనిపోగా ఇట్టి విషయం తెలుసుకున్న గంభీరావుపేట మండలంలోని నాగంపేట కు చెందిన నర్ర విద్యాసాగర్ రెడ్డి తన తండ్రి నర్ర లింగారెడ్డి ని ఆదర్శంగా తీసుకుని పెండ్లికి పెద్దగా మారి అక్షర(స్వప్న) వివాహానికి తండ్రికొడుకులు వచ్చి పుస్తె మెట్టెలు అందజేశారు.పెండ్లికి పెద్దగా మారిన నర్ర లింగా రెడ్డి,నర్ర విద్యాసాగర్ రెడ్డికి వధువు తరపున బంధుమిత్రులు లింగారెడ్డికి,విద్యాసాగర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.పుస్తె మెట్టెలు అందజేసే కార్యక్రమంలో కొఠారి జగన్,బెస్త నరేష్ ఎల్లారెడ్డిపేట మాజీ
ఎంపీటీసీ,ఒగ్గు బాలరాజు యాదవ్ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్