*జర్నలిస్టులకు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలి*
*అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి*
*పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించిన జర్నలిస్టులు*
జ్యోతి న్యూస్ – చందుర్తి
రాష్ట్రంలో జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలి చందుర్తి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ డిమాండ్ చేశారు.రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు సోమవారం చందుర్తి మండల కేంద్రంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. పోస్ట్ కార్డులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ కు పోస్ట్ ద్వారా పంపారు.ఈ సందర్భంగా చందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు ముఖ్య భూమిక పోషించారని,అలాంటి జర్నలిస్టులు నేడు స్వరాష్ట్రంలో ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో సత్వరమే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టు హెల్త్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు.అంతే కాకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. చందుర్తి మండలంలో జర్నలిస్టులకు ఇండ్ల కళ కలగానే మిగిలిందన్నారు.ఈ
కార్యక్రమంలో ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు లాండే ప్రసాద్, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు గోట్టే మనోహర్, గడ్డం తిరుపతిరెడ్డి, జర్నలిస్టులు పొంచెట్టి మహేష్, పత్తిపాక నాగరాజు, రాజూరి విష్ణు, నక్క యాకుబ్, బోట్లవార్ శ్రీనివాస్, మేడిశెట్టి మధు, ఏనుగుల కృష్ణ, మ్యాకల కొమురయ్య,మోహినోదిన్, లింగాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.