ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా కాంగ్రెస్ పార్టీల పిలుపుమేరకు వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముస్తాబాద్ మండల ఇంచార్జ్ సాగరం వెంకటస్వామి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కరోనా తర్వాత పేద మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురైతే అదాని ఆస్తులు మాత్రం ఏకంగా 891 శాతం పెరిగాయి దేశంలో కేవలం అదాని కోసమే కొన్ని సంస్కరణలు చేసింది నిజం కాదా? దేశంలోని పోర్టులను ఎయిర్ పోర్టులను నిబంధనలు మార్చి మరి కట్టబెట్టింది నిజం కాదా? అంటూ మండిపడ్డారు దేశ యొక్క సంపాదన ఆధానికి దోచిపెడుతుంటే దాన్ని ఆధారాలతో సహా పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే వారిపై కుట్రపూరితంగా అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే అని అన్నారు బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీపై చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త తిప్పి కొడతారు భవిష్యత్తులో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, జిల్లా కార్యదర్శి పెద్దగారి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వెలుముల రాంరెడ్డి, ముద్దం రాజేందర్ రెడ్డి, దీటి నర్సింలు, ఆరుట్ల మహేష్ రెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి, మాధాసు అనిల్, అన్నం సంతోష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, రంజాన్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

