Breaking News

ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

267 Views

– డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప

చం దుర్తి – జ్యోతి న్యూస్

చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో ప్రతిమఫౌండేషన్, ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ను సోమవారం ప్రతిమ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని వికాస్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ అన్ని రకాల జబ్బులకు కలుషిత నీరే కారణమని త్రాగే మంచినీరు పరిశుభ్రమైన మంచి నీటిని తీసుకోవాలని గ్రామా వాసులకు సూచించారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్య ఉద్దేశం తో రామన్న పేట గ్రామం లో పెరిక సంఘం, గ్రామ సర్పంచ్ దుమ్ము అంజయ్య అభ్యర్థన మేరకు ప్రతిమ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ప్రతి మండలానికి అత్యవసర సమయంలో ఆంబులెన్స్ ఉండాలనే ఉద్దేశంతో అంబులెన్స్ ప్రతి మండలానికి ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతిమ సంస్థ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల వద్దకే డాక్టర్లు ,దవాఖాన అనే ముఖ్య ఉద్దేశంతొ ప్రతిమ మీ ముంగిట్లో అను నీనాదంతొ ప్రతిమ ఆరోగ్య రథంను తీసుకురావడం జరిగిందన్నారు.నేటి మహిళలు ఆర్థికంగా, మానసికంగా తన కాళ్ళ మీద తాను నిలవడానికి ముందుంటున్నారు. దీనిలో భాగంగా ప్రతిమ ఫౌండేషన్ వారికీ స్వయం ఉపాధి ఆర్థిక చేయూతనిస్తూ వారికి అండగా ఉంటుందన్నారు. ముఖ్యంగా యువత అన్ని రంగాలలో రాణించాలని యువతకు సూచించారు.  ఈ సందర్భంగా వికాస్, డాక్టర్ దీపా ను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగం కుమార్, సర్పంచ్ దుమ్మ అంజయ్య , ఉప సర్పంచ్, చింతల భూలక్ష్మి, ఎంపీటీసీ వనజ దేవస్వామి, పెరిక సంఘం జిల్లా అధ్యక్షులు మార్త సత్తయ్య , గ్రామ పెరిక సంఘం అధ్యక్షులు పోతరాజు తిరుపతి, పె ఏ ఎం సి డైరెక్టర్ నగేష్ , జోగపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్ మాజీ సర్పంచ్ కనక రాజు, నాయకులు లింగంపల్లి బాబు, రాకేష్, బూంరెడ్డి, మహిళ సంఘం సభ్యులు ,గ్రామ ప్రజలు ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna