రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటి ప్రయాణాలు పెట్టుకోవద్దని, బారి వర్షాల దృష్ట్యానర్మాల ఎగువ మానేరు జలాశయం నుండి వరద ప్రవాహం ఎక్కువగా వస్తుందని,మానేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండలని, రైతులు పొలాల దగ్గరకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, ఇనుప స్తంభాలను ముట్టుకోవద్దని, మోటార్లను స్టాటర్లను, తాకవద్దని, జలాశయాలు, చెరువులు, వాగుల వద్ద జనాలు వెళ్లవద్దని,గ్రామంలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితి ఉంటే గ్రామ పంచాయతీ దృష్టికీ తీసుకు రావాలని పునరావాసం కల్పిస్తామని సర్పంచ్ ఎడబోయిన రాజు విజ్ఞప్తి చేశారు.
