పిండి తో వినాయకుని ప్రతిమ ను తయారు చేసిన మాడల్ స్కూల్ 7 వ తరగతి విద్యార్థీని సాన్వీ :
తొలి ఏకాదశి సందర్భంగా తమ ఇంటి వద్ద గోధుమ పిండి తో హార్షలు తయారు చేస్తుండగా ముస్తాబాద్ మండలం నామాపూర్ మాడల్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండి స్రవంతి మల్లేశ్ ల పెద్ద కూతురు బండి సాన్వీ మంగళవారం గోదుమ పిండితో వినాయకుని ప్రతిమను చూడముచ్చటగా తయారు చేసి శభాష్ అనిపించుకుంది.వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలను వివిధ రకాల రసాయనాలు కలిపిన రంగులతో తయారు చేసి చెరువు కుంటల్లో నిమజ్జనం చేసి పర్యావరణాన్ని పాడుచేయవద్దని కోరుతూ తన వంతుగా 16 మట్టి విగ్రహాలను తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తానని సాన్వీ తెలిపింది, పిండితో వినాయక ప్రతిమను తయారు చేసిన సాన్వీ ని ముస్తాబాద్ మండల పరిషత్ అధ్యక్షులు జనగామ శరత్ రావు, జెడ్ పి టి సి సభ్యులు నర్సయ్య, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అభినందించారు,
