ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో
పెరుగుతున్న అడ్మిషన్లు
ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ల నుంచి 52 మంది విద్యార్థుల చేరిక
విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం , ఉచితంగా రెండు జతల స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ
ఆంగ్లములో విద్యా బోధన
ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులు , టీచింగ్ స్టాఫ్ తో పాఠశాల యాజమాన్య కమిటీ సమావ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపస్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధన తరగతులు నిర్వహించబడుతున్నాయని ప్రధానోపాధ్యాయులు కుబేర స్వామి తెలిపారు,ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ల నుంచి ఇప్పటివరకు సుమారు 52 మంది విద్యార్థులు చేరారని ఆయన చెప్పారు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజనం , ఉచితంగా పాఠ్యపుస్తకాలు , రెండు జతల స్కూల్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుందన్నారు ,
యజమాన్య కమిటీలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థి యెక్క తల్లి లేదా తండ్రితో కమిటీ సభ్యున్ని ఎంపికచేసి తరగతికి ముగ్గురు తల్లిదండ్రులతో కమిటీ ఏర్పాటు చేసి అందులోనుంచి ఒకరిని చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో జరుగుతున్న విద్య బోధనలో విద్యార్థుల డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఉపాధ్యాయుల బోధనా పనితీరు పై ప్రతినెల పాఠశాల యజమాన్య కమిటీ పాలకవర్గం చే సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం జరుగుతుందన్నారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త దుంపెన రమేష్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నుంచి అతని మనుమరాలు శ్రీజా ను ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతిలో, అతని మనుమడు హారికను ఒకటవ తరగతి లో చేర్పించినట్లు ప్రదానోపాద్యాయులు కుబేర స్వామి తెలిపారు, ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపస్ లోకి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మార్చిన తర్వాత 52 మంది విద్యార్థులు వివిధ ప్రైవేటు పాఠశాల నుంచి చేరారని ఇంకా అడ్మిషన్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు,
ప్రధాన ఉపాధ్యాయులుగా కుబేర స్వామి , ఆంగ్ల మాధ్యమంలో పి అంజయ్య , ఎం ఉదయలక్ష్మి, కే శోభారాణి, జి అరుంధతి లు ఉపాద్యాయులు గా పని చేస్తున్నారు, ఈ సంవత్సరం జిల్లా విద్యాశాఖ ఇద్దరినీ విద్యా వాలంటీర్లను నియమించనున్నట్లు ఆయన చెప్పారు
ప్రకృతి ప్రేమికుడు దుంపెన రమేష్ తన కోడలు స్రవంతి ని ఉచితంగా విద్య వాలంటీర్ గా నియమించనున్నట్లు సామాజిక కార్యకర్త ప్రకటించారు
