చవితిలో డిజె సౌండ్స్ పెట్టి వ్యక్తి మృతికి కారణమైతే హత్య కేసు నమోదు చేస్తాం: డీఎస్పీ నాగేంద్ర చారి
సెప్టెంబర్ 16
వేములవాడ హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వేములవాడ సబ్ డివిజన్ ప్రాంతంలోని ప్రజలు వినాయక మండప నిర్వాహకులు భక్తులు ఎవరు కూడా ఈ సంవత్సరం ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా డిజె సౌండ్స్ పెట్టేందుకు అనుమతి లేదని వేములవాడ సబ్ డివిజన్ డిఎస్పి నాగేంద్ర చారి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక విగ్రహ ప్రతిష్ట, నిమజ్జనంలో పోలీసు నియమ నిబంధన ఉల్లంఘించి డిజె సౌండ్స్ పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా డిజె సౌండ్స్ ద్వారా ఎవరైనా మృతి చెందితే హత్య కేసు నమోదు చేస్తామని డిఎస్పి హెచ్చరించారు. వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో జరుపుకుని స్థానిక పోలీస్ అధికారులకు సహకరించాలి ఆయన కోరారు.
