Breaking News ప్రాంతీయం

బాలసాహిత్యంలో విస్తృత పరిశోధనలు జరుగాలి..

126 Views

బాలసాహిత్యంలో విస్తృత పరిశోధనలు జరుగాలి..
( తెలంగాణ బాలసాహిత్య సమ్మేళనంలో వాసరవేణి ప్రసంగం)

బాల్యం అమూల్యమైనదనీ,బాల్యాన్ని చక్కగా మలుచాలంటే ఉత్తమ బాలసాహిత్యం అవసరమనీ , బాలసాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో మంచి రచనలు రావాలనీ,అలాగే బాలసాహిత్యంలో విస్తృత పరిశోధనలు జరుగాలనీ డాక్టర్ వాసరవేణి పర్శరాములు* అన్నారు.
మే 24,25 రెండురోజులు *తెలంగాణ సారస్వత పరిషత్తులో రాష్ట్రస్థాయి బాలసాహిత్య సమ్మేళనం* జరిగింది. బాలసాహిత్య చర్చాసమూహంలో *బాలసాహితీవేత్త డా.వాసరవేణి పరశురాం బాలసాహిత్యం నాడు నేడు పై ప్రసంగించారు.* ప్రాచీనంనుండి జానపద బాలసాహిత్యం ఉందనీ మౌఖికంగా వస్తుందనీ తాతమ్మలు తండ్రులు పిల్లలను కూర్చబెట్టకుని కథలు,పాటలు అనేక విషయాలను చెప్పేవారనీ కొంత రికార్డు అయినప్పటికీ ఇంకా చాలా రికార్డు చేయాల్సిన అవసరముందన్నారు. నేడు బాలసాహిత్యకారులు బాలలమనస్థత్వానికి అనుకూలంగా వికాసంకోసం రాయాలనీ, బాలలస్థాయికి దిగాలన్నారు.బాలసాహిత్య రచయితలు ఉతములై బాలలకు ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నారు. రాసేదొకటి చెప్పేదొకటిగా కాకుండా నిజాయితీగా ఉండాలన్నారు. తాను 1990 6వ.తరగతినుండి 30 సంవత్సరాలుగా బాలలకోసం రచనలు చేస్తున్నాననీ బాలసాహిత్యంలో పరిశోధన చేశానని తెల్పారు. ఉత్తమ బాలసాహిత్యంతో ఉత్తమ సమాజం నిర్మాణమవుతుందన్నారు. నేడు యువతపక్కదారి పట్టడానికి నైతిక మానవతావిలువలు అందించకపోవడంతోపాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనన్నారు. ప్రతి ఒక్కరు బాలలభవిష్యత్తు నిర్మాణానికి పాటుపడాలని పరశురాంలు తెల్పారు.అనంతరం పుస్తకాలు అందించి మెమొంటో,ప్రశంసాపత్రంతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి చెన్నయ్య,వరప్రసాద్ రెడ్డి, బాలసాహితీవేత్తలు డా.పత్తిపాక మోహన్, గరిపెల్లి అశోక్, డా.అమరవాది నీరజ, అమ్మిన శ్రీనివాస్, బండారు జయశ్రీ, తూర్పింటి నరేష్, అబ్దల్ ఘనీ, ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మీ, ఉండ్రాల రాజేశం,ఆవుల చక్రపాణి, సంగనభట్ల రామకృష్ణయ్య, కొమిరెడ్డి బుచ్చిరెడ్డి* తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *