ప్రాంతీయం

గ్రామపంచాయతీలో ఒకరికి ఓన్యాయం మరొకరికి ఇంకో న్యాయమా దీనికి నిరసనగా వ్యాపార సముదాయాలు బందుకు సహకరించాలి. అఖిలపక్షాలు…

241 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి 28, శివకేశవ ఆలయమునకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న సర్పంచ్ గాండ్ల సుమతి ఇల్లు తనభర్త గాండ్ల కృష్ణమూర్తి పేరుమీద గత ఫిబ్రవరి నెలలో పర్మిషన్ తీసుకున్నామని చెబుతున్నారు కానీ వారు సిసి రోడ్డు నుండి మూడు ఫీట్లు మాత్రమే సెట్ బ్యాక్ చేసి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఇదేరోడ్డులో సర్పంచ్ సుమతి ఇంటి ముందు ఉన్న తారక కళావతి భర్త బాబు మరియు పార్వతీ శ్రీధర్ తండ్రి సత్యనారాయణకి రోడ్డు సెంటర్ నుండి16 ఫీట్లకు సుమతి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో పర్మిషన్ ఇచ్చారు. అధికారులకు ఎన్నోసార్లు పిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోకుండా జాప్యం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు అందుకు నిరసనగా అఖిలపక్షం కమిటీ ఆధ్వర్యంలో రేపు అనగా సోమవారం రోజు ముస్తాబాద్ వ్యాపార సముదాయాలకు అఖిలపక్షం తరఫున ముస్తాబాద్ గ్రామం మేజర్ గ్రామపంచాయతీలో అక్రమ నిర్మాణాల గూర్చి వ్యాపార సముదాయాలు బందుకు మద్దతు సహకరించాలని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పట్టణ ప్రజలను కోరుతున్నాంమని అఖిలపక్ష నాయకులు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *