జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్లేయర్స్….
_ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మనోజ్ ( రాచర్ల బొప్పాపూర్ )మరియు మానస( ఆసిఫ్ నగర్ )లు వెస్ట్ బెంగాల్ లో ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు జరుగు జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గిన్నె లక్ష్మణ్ తెలియజేశారు. 17వ తారీకు నుండి నిన్నటి వరకు శిక్షణ శిబిరం ముగించుకున్న క్రీడాకారులు ఈరోజు ఉదయం వెస్ట్ బెంగాల్ బయలుదేరినట్టు తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనటువంటి క్రీడాకారులను నాలుగు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, వాలీబాల్ అసోసియేషన్ బాధ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.
