చందుర్తి – జ్యోతి న్యూస్
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని ఆదివారం చందుర్తి జడ్పిటిసి నాగం కుమార్ దర్శించుకున్నారు. శ్రీ శుభకృత్ నామ తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా జడ్పిటిసి కుమార్ మాట్లాడుతూ చందుర్తి మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని. రైతుల పాడి పంటలు పండాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బొర్ర రవీందర్. వెంకటేష్ ఉన్నారు.