వేములవాడ – జ్యోతి న్యూస్
వేములవాడ పట్టణంలోదొడ్డి కొమురయ్య 95వ జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో వేములవాడ తెలంగాణ చౌక్ లో కురుమ కుల బంధువుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కురుమ సభ్యులు పలువురు మాట్లాడుతూ… ప్రతి కురుమ సభ్యులు దొడ్డి కొమురయ్య అడుగుజాడల్లో నడవాలని, విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మరియు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం ఉపాధ్యక్షులు జక్కుల తిరుపతి, వేములవాడ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు గుంటి కనకయ్య, జిల్లా ఉపాధ్యక్షులు అమరగొండ కిషన్, పట్టణ ఉపాధ్యక్షులు ఏనుగుల కృష్ణ, జిల్లా కురుమ సంఘం నాయకులు మ్యకల పరశురామ్, ముత్త మహేష్, మ్యాకల కొమురయ్య, పట్టణ కోశాధికారి ఏనుగుల శ్రీనివాస్, జిల్లా ఒగ్గు కళాకారులు అధ్యక్షులు గాజర్ల బుగ్గయ్య, గాజర్ల దేవరాజు, ఒగ్గు మహేందర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.