మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదానికి గురికావద్దు — సామజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్
అక్టోబర్ 10
సిద్దిపేట జిల్లా మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం యువకులు ద్విచక్ర వాహనాల రై రై మంటూ గ్రామంలో చెక్కర్లు కొడుతున్న యువకులను ఆపి వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువు, క్రీడలపై దృష్టి సారించాలని, వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని సూచించారు ప్రమాదాల బారినపడి తల్లిదండ్రులకు నష్టం వాటిలే పనులు చేయవద్దని, సెల్ ఫోన్లు కూడా ఎక్కువ వాడకుండా బుద్ధిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పుట్టిన ఊరుకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని యువతకు తగు సూచనలు చేయడం జరిగిందని అన్నారు సిలివెరి శ్రీనివాస్ జి .మహేష్ తదితరులు పాల్లోన్నారు
