Breaking News

దళితబంధు పథకాన్ని లబ్దిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి*

124 Views

రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 11

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని లబ్దిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో దళితబంధు పథకంపై నిర్వహించిన అవగాహన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలికంగా స్వయం ఉపాధిని అందించే రంగాలలోని యూనిట్లను ఎంపిక చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. గండిలచ్చపేట గ్రామంలో 33 మంది లబ్దిదారులను దళితబంధు పథకంలో భాగంగా ఎంపిక చేశామని తెలిపారు. పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు యూనిట్లపై తగిన అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు.  సమూహంగా  కొంతమంది కలిసి భాగస్వామ్య పద్ధతిలో కూడా పెద్ద ఎత్తున యూనిట్లను స్థాపించుకోవచ్చని అన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన నిధుల నుండి 10 వేల రూపాయలు దళిత రక్షణ నిధి కోసం కేటాయించడం జరిగుతుందని ఆయన తెలిపారు.

     ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, డీఆర్డీఓ కె. కౌటిల్య, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు, తహశీల్దార్ సదానందం, ఎంపీడీఓ లచ్చాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

*నర్సరీలో పెంచుతున్న మొక్కల పరిశీలన*

గండిలచ్చపేట గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో 15 వేల మొక్కలు పెంచుతున్నామని సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కంపోస్ట్ షెడ్ నిర్వహణ తీరుపై ఆరా తీశారు. కంపోస్ట్ షెడ్ ద్వారా విక్రయించే వ్యర్థాల రిజిస్టర్ ను పరిశీలించారు. ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో డీఆర్డీఓ కె. కౌటిల్య, ఎంపీడీఓ లచ్చాలు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7