Breaking News

హరిదాస్ నగర్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి… తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

118 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని ఎమ్మార్వోకార్యాలయం ఎదుట ధర్నా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన రైతులను ఆదుకోవాలని తొమ్మిదవ ప్యాకేజీ డి బ్లాక్ కాలువను పాత నక్ష ప్రకారమే తీయాలని మండల కాంగ్రెస్ కమిటీ శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ హరిదాస్ నగర్ గ్రామంలో 9వ ప్యాకేజీ డీ బ్లాక్ కాల్వ కోసం ఇరిగేషన్ అధికారులు పాత నక్ష ప్రకారం అంచనాలు వేయడం జరిగిందన్నారు. దీనికి రైతులు కూడా ఒప్పుకొని నష్టపరిహారం తీసుకోవడానికి సిద్ధం కావడం జరిగిందన్నారు కానీ ఇటీవల ఇరిగేషన్ డి ఈ శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు పట్టుకొని అలైన్మెంట్ మార్చడం కోసం సర్వే చేపట్టడం జరిగిందన్నారు రామలక్ష్నపల్లె సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ నాయకుడైన రవీందర్ రెడ్డి పెట్రోల్ బంకు నిర్మాణం చేస్తున్నందున దానిని తప్పించడానికి కొత్త అలైన్మెంట్ సర్వే చేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా గూడ సిద్ధారెడ్డి అనే రైతుపై సర్పంచ్ దాడి చేయడం జరిగిందన్నారు రైతుల నష్టపోకుండా పాత నక్ష ప్రకారమే కాలువను తీయాలని రైతుల కోసం మండల కాంగ్రెస్ పార్టీ పోరాటం పోరాటం చేస్తున్నడం జరుగుతుందన్నారు. అనంతరం తాసిల్దార్ జయంత్ కుమార్ కు పాత నక్ష ప్రకారమే కాలువ తీయాలని వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టిపిసిసి సంగీతం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, దండు శ్రీనివాస్, గంట బుచ్చ గౌడ్, మామిండ్ల కిషన్ చెన్ని బాబు, పందిర్ల శ్రీనివాస్ గుర్రం రాములు, సురేష్ ఆవునూరు మాజీఎంపిటిసి మిరియాల కార్ శ్రీనివాస్ కొత్తపల్లి దేవయ్య ని రవి రెడ్డి మల్ల సత్యనారాయణ ఎండి హిమాన్ రమేష్ రైతులు తదితరుల పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్