రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల తుర్కాశీ నగర్ లో గాలికి లేచిపోయిన రేకుల ఇంటి పైకప్పు నిరాశ్రులైన కుటుంబం పక్కింటి లో తలదాచుకున్న కుటుంబం
ఎల్లారెడ్డిపేట మండలం దుమాల తుర్కాశీ నగర్ లో రేకుల ఇంటి పైకప్పు గాలికి లేచిపోయి ఆ కుటుంబం నిరాశ్రులయ్యారు,తుర్కాశీ నగర్ కు చెందిన షేక్ హైదర్ కు చెందిన రేకుల ఇల్లు సోమవారం సాయంత్రం 5-00 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావటంతో రేకుల పైకప్పు అమాంతంగా లేచి పోయింది ఆ సమయంలో రేకుల ఇంటి లో ఉన్న హైదర్ భార్య పాతీమాభీ వారి పిల్లలు హీమామ్భీ షాబోద్దీన్ షబ్బీర్ లు వర్షం లో తడిసి పోయారు భయంతో శేఖ్ చోటే కు చెందిన పక్కింట్లో కి వెళ్లి తలదాచుకున్నారు ప్రాణాలు దక్కించుకున్నారు, లేకుంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది, అట్టి రేకుల ఇంట్లో ఉన్న ఆ కుటుంబానికి సంబంధించిన బట్టలు సామానులు నిత్యావసర వస్తువులు , బియ్యం అన్ని తడిసిముద్దయ్యాయి తీవ్రంగా నష్టపోయారు దీంతో ఆ కుటుంబం నిరాశ్రులయ్యారు, వెంటనే అధికారులు స్పందించి ఆ నిరుపేద కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని దుమాల గ్రామస్తులు కోరుతున్నారు,
