ప్రాంతీయం

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే విధుల్లోకి చేరాలి లేదంటే….

168 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 8, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే విధుల్లో  చేరాలి లేదంటే విధుల్లోంచి తొలగిస్తాం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌) చేస్తున్న‌ సమ్మె వెంట‌నే విర‌మించి విధుల‌లో చేరాల‌ని ప్ర‌భుత్వ ఆదేశించింది.. వారు చేస్తున్న‌స‌మ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్‌లు విధుల్లో చేరాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్‌ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు ఏప్రిల్‌ 29 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *