ప్రాంతీయం

రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారు… ఆరుకాలం పండించిన పంట అన్నదాత అయోమయం.. పండించిన వరిధాన్యం వరద పాలు…

218 Views

 

 

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 8, ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం లేక రైతుల ఇబ్బందులు. మండలంలోని మందనకల్ గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఇటీవలే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించింది. గ్రామంలో వరి కొనుగోలు సెంటర్కు స్థలం నామాత్రంగా భూమిని సదును చేసినా ఇబ్బందులు మాత్రం తప్పడంలేదు ధాన్యం కొనుగోలు కేంద్రానికి అనువైన స్థలం లేక అకాలవర్షానికి ధాన్యం వర్షనీటి దాటికి వరద పాలు అవడంతో రైతులు ఒకేసారి బోరున విలపిస్తున్నారు. కొన్ని కుప్పల్లో మీరునిలిచి ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తడంతో తీవ్రనష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డైరెక్టర్ మాధవరావును నిలదీశి అంతేకాకుండా రైతులు గ్రామ సర్పంచి వెంకటేశ్వరి నారాగౌడ్ ను రైతులను పట్టించుకోకుండా కడుపునిండాతిని కడపలోపల ఉండి మాట్లాడుతున్నారా అని చరవాణితో మాట్లాడి హెచ్చరించారు. పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని అకాల వర్షంతో వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కొనుగోలు కేంద్రాల్లో స్థలాలు లేక టార్పాలిన్ కవర్లు లేక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని రైతుల స్వయంగా పరదాలు అద్దెకు తెచ్చుకుని ధాన్యం ఆరబోయవలసి వస్తుందని ప్రభుత్వ స్పందించి కొనుగోలు కేంద్రాల్లో దాన్యం ఆరబోసేందుకు టార్టాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. నానిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెనువెంటనే కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *