కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఆదివారం రాత్రి కొందరు దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది.
ఈ సంఘటనను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మండల్ అధ్యక్షులు కుమ్మరి దేవదాస్ ఆధ్వర్యంలో ధర్నా మరియు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అలాగే కోనరావుపేట ఎస్సై కి వినతి పత్రం అందించి దుండగులను వెంటనే గుర్తించి చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది.రోజురోజుకు సమాజంలో బలోపేతం అవుతున్నటువంటి అంబేద్కర్ భావజాలాన్ని. బహుజనుల ఐక్యతను విచ్చిన్నం చేయడానికి మనువాద ముసుగు వేసుకున్న కొందరు దుండగులు చేసినటువంటి ఇలాంటి చర్యల వలన బహుజన వాదం మరింతగా బలపడుతుందని పేర్కొనడం జరిగింది.
అంబేద్కర్ ఏవో కొన్ని వర్గాల ప్రజలకు ప్రతినిధి గా కాకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందని అలాంటి మహనీయుని విగ్రహాలను కొందరు అజ్ఞానంతో ధ్వంసం చేయడం మంచిది కాదని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మరిమడ్ల గ్రామ సర్పంచ్ మాట్ల అశోక్. మరిమట్ల బీఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షులు భీమాశంకర్ లంబాడ ఐక్యవేదిక మండల అధ్యక్షులు భూక్య నరేష్ కుమ్మరి వేణు బూర్ల విజయ్ జింక అనుకు. విల్సన్ కుమ్మరి దేవయ్య మరియు కడకుంట్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.




