చందుర్తి – జ్యోతి న్యూస్
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామ సీతారామాలయ కమిటీ కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. వచ్చే నెల 10వ తేదీన శ్రీ రామనవమి పండుగ జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ని ఎన్నుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గా గ్రామ సర్పంచి మ్యాకల పర్శరాములు ను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా వివిధ కుల సంఘాల నుండి ఒక్కొక్కరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, సర్పంచ్ పర్శరాములు మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.