చందుర్తి – జ్యోతి న్యూస్
చందుర్తి మండలం బండ పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆరాధన బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా గురువారం సుదర్శన హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కొదమగుళ్ల శ్రీకాంత చార్యులు ఆధ్వర్యంలో హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.