కోనరావుపేట/ రిపోర్టర్ డి. కరుణాకర్ / రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బొల్లె ఇస్సాకు, రూప, దంపతులకు చెందిన కూతురు చేరిస్మ, నాలుగు సంవత్సరాల వయస్సు గల అమ్మాయి ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు దాడిచేసి గాయపడ్డాయి. అమ్మాయికి తీవ్రమైన గాయాలు కాగా తలకు కుట్లు పడ్డాయి. చిన్నారులపై కుక్కలు విచక్షణారహితంగా దాడులు చేయడంతో తల్లిదండ్రులలో భయం వేలన మొదలయ్యాయి. కుక్కల దాడి నుంచి కాపాడాలని ప్రజలు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. మండలం మొత్తం మీద సుమారు3 వేల కుక్కలు సంచరిస్తున్నాయి. ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తాయో అని గ్రామాలలో ప్రజలు బిక్కుబుక్కుమంటు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల దాడికి గురై ప్రాణాలు పోకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
