Breaking News ప్రాంతీయం

డిసెంబర్ 7 లోపు స్మశాన వాటిక విరాళాలు వాపస్ ఇవ్వాలి – ఎమ్మెల్యే

70 Views

మంచిర్యాల జిల్లా.

డిసెంబర్ 7 లోపు స్మశాన వాటిక విరాళాలు వాపస్ ఇవ్వాలి.

మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గడువు.

మంచిర్యాల గోదావరి నదీ తీరంలో స్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావుకు పరోక్షంగా హితవుపలికారు. డిసెంబర్ ఏడవ తేదీ లోపు ఎవరి డబ్బులు వారికి తిరిగి చెల్లించాలని గడువు ఇచ్చారు. శుక్రవారం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి వ్యాపారస్థులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, స్మశాన వాటిక నిర్మాణం కోసం అనేక మంది నుంచి సుమారు 90 లక్షల చందాలు వసూలు చేసి నెలలు గడుస్తున్నాయన్నారు. స్మశాన వాటిక నిర్మించలేని నేత వసూలు చేసిన విరాళాలను దాతలకు తిరిగి ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలతీశారు. ఏడవ తేదీ లోపు దాతల డబ్బులు తిరిగి ఇవ్వకపోతే 8,9 తేదీల్లో చందాలు వసూలు చేసిన వారిపై, మధ్య వర్తులుగా ఉన్న వారిపై ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. అంతే కాకుండా లక్షకు రెండు లక్షలు జరిమానా రూపంలో వసూలు చేస్తామని స్పష్టం చేశారు. లక్ష దాతలకు మిగతా లక్ష కొత్తగా ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న వైకుంఠ దామంకు విరాళంగా ఇస్తామని తెలిపారు. ఎన్ని శక్తులు అడ్డుకోవాలని చూసిన మంచిర్యాల నియోజకవర్గ ము అభివృద్ధి, సంక్షేమం ఆగబోదని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు అభివృద్ధి ని చూసి ప్రశంసించాలి తప్ప అసత్య ప్రచారం చేసి పరువు తీసుకోవద్దని సూచించారు. రెండేళ్లలో 20 ఏండ్ల అభివృద్ధి ని చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆరెస్ పార్టీలను ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు.

అవును బీఆరెస్ జెండాలు తీయించాం.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సంధర్భంగా అధికారికంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో బీఆరెస్ పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం సహేతుకం కాదని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల, నస్పూర్ పురపాలక సంఘాల పరిధిలో డివైడర్లు, సర్కిళ్ల వద్ద , రోడ్డు పక్కల జెండా తోరణాలు, జెండాలను ఉద్దేశ్యపూర్వకంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. పది రోజులపాటు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నామని అందుకు ఏర్పాట్లు చేసుకున్నామని అన్నారు. పోలీస్, మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా జండాలు ఏర్పాటు చేయడంతో అధికారులు వాటిని తొలగించారని చెప్పారు. అనంతరం స్మశాన వాటిక నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్