133 Views


వేములవాడ పట్టణంలో త్రినేత్ర ఫంక్షన్హాల్లో ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ షిహాన్ కె.వసంత్ కుమార్ శనివారం నిర్వహించారు. సీనియర్ కరాటే గ్రేడింగ్ టెస్ట్ లో వేములవాడ, నిర్మల్ జిల్లాకు చెందిన ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి సీనియర్ బెల్ట్స్ సాధించారు. వేములవాడకు చెందిన 6 గురువిద్యార్థులు సహజ, అఫ్సర్, అమీర్, అష్రఫ్, ఏం ప్రణయ్ శ్రీ, ఏనుగుల వర్షిత్ బ్రౌన్, అలాగే నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థినిలు సీహెచ్ లతిక, అక్షయ, కావ్య, శ్రీ నిధి, సీనియర్ సీనియర్ బ్రౌన్ బెల్టు సాధించారు. వీరికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు బెల్టు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేటి సమాజంలో ఆత్మరక్షణ కోసం ఆత్మవిశ్వాసం కోసం విద్యార్థులు, యువత కరాటే నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్, సీనియర్ కరాటే శిక్షకులు, సీనియర్ జర్నలిస్టు ఎం.ఏ.మన్నాన్, కరాటే శిక్షకులు, నిర్మల్ జిల్లా కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కొమురవెల్లి భూమేశ్, జే జే ఎస్ రాష్ట్ర కార్యదర్శి సుంకపాక దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

