ప్రాంతీయం

*గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి*

119 Views

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 మార్చి 14: గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ డే నిర్వహించి, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాఖల వారిగా కౌంటర్లు ఏర్పాటుచేయనున్నట్లు, దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. సంబంధిత జిల్లా అధికారులు పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం చేయాలన్నారు. సోమవారం ప్రజల నుండి డబుల్ బెడ్ రూమ్ పథకానికి 9, భూ సంబంధ 15, భూ సేకరణ సంబంధ 6, దళిత బంధు గురించి 2, ఇతరాలు 5, మొత్తం 37 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై మన ఊరు-మనబడి, మన బస్తి-మన బడి, హెల్త్ ప్రొఫైల్, దళిత బంధు కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సూచనలు చేశారు. మండల ప్రత్యేక అధికారులు వారి వారి మండల పరిధిలో మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద ఎంపిక అయిన పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని అన్నారు. కార్యక్రమ అమలుపై ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కల్గి ఉండాలని, 12 అంశాలలో 9 అంశాలు శాఖాపరంగా, 3 అంశాలు ఉపాధి క్రింద చేపట్టాలని అన్నారు. పనుల నిర్వహణకు మండలానికి ఇంజనీరింగ్ విభాగం కేటాయించినట్లు, పాఠశాల నిర్వహణ కమిటీ, ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు అవసరాలు గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన అన్నారు. హెల్త్ ప్రొఫైల్ విషయమై టీములు వెళుతున్నది, నమూనాల సేకరణ, సేకరించిన నమూనాలు సమయంలోగా పరీక్షా కేంద్రానికి పంపుతున్నది మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. దళిత బంధు అమలుపై జాబితాను తీసుకొని, ఏ ఏ యూనిట్లు పెడుతున్నది, యూనిట్లపై నైపుణ్యం ఉన్నది లేనిది, యూనిట్ల సరఫరాదారులు, ఉత్పత్తి మార్కెటింగ్ తదితర అంశాలపై వారికి అందించాల్సిన సహాయ సహకారాలపై పర్యవేక్షించాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, ఎన్. ఖీమ్యానాయక్, ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, కలెక్టరేట్ ఏఓ గంగయ్య, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7