Breaking News

అధికారులు నాణ్యతలేని పనిముట్లకే ప్రాధాన్యత

81 Views

సింగరేణిలో రక్షణ సూత్రాలకు తిలోదకాలిస్తున్న

అధికారులు నాణ్యతలేని పనిముట్లకే ప్రాధాన్యత

మంచిర్యాల జిల్లా

మార్చి 2

సింగరేణి సంస్థలో రక్షణ సూత్రాల విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారని నాణ్యతలేని పనిముట్లను కొనుగోలు చేస్తూ కార్మికులను అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు రక్షణకు సంబంధించిన బూట్లు చేతి తొడుగులు హెల్మెట్లు ఉత్పత్తికి సంబంధించిన డ్రిల్ రాడ్స్ బిట్స్ నాసిరకం సరఫరా చేస్తూ కార్మికుల రక్షణను గాలికొదిలేస్తున్నారని కమిషన్ లే పరమావధిగా అధికారులు కార్మికులను వేధిస్తున్నారని కార్మికులంతా ఆవేదనకు గురవుతున్నారు.

ఇంత జరుగుతున్న గెలిచిన సంఘాలు కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం రోజు ఫ్రీ మాస్టర్స్ పొందుతూ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భూగర్భ గనుల్లో నిత్యం అధికారుల వేధింపులు అధికమయ్యాయని కనీసం గాలి నీరు సరఫరా కోసం కూడా అధికారుల దగ్గర ప్రస్తావించాలంటే భయానికి గురవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు మొన్నటికి మొన్న కార్మిక సంఘాల ఎన్నికలు జరిగి పోరాట సంఘం అని చెప్పుకునే నాయకులు కొత్త సీసా పాతసారవలె వివరిస్తూ.

నిన్నటిదాకా కొందరు మాస్టర్ లకు కక్కుర్తి పడ్డ వాళ్లే  మళ్లీ గెలిచిన సంఘాల్లో చేరి యాజమాన్యానికి వంత పాడుతున్నారని కార్మికుల పరిస్థితి తుంటేసి మొద్దెత్తుకున్న చందంగా మారిందని సింగరేణిలో ఎన్నికలు కార్మికుల పట్ల శాపంగా మారాయని ఎలాంటి పరిస్థితులు ఉన్న అడిగే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఏ సంఘం గెలిచినా యాజమాన్యానికి అనుకూలంగా మారి కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయడమే తప్ప కార్మికులకు అనుకూలంగా పనిచేయలేదని సింగరేణిలో ఎన్నికల రద్దు కోసం అన్ని సంఘాలు ఏకమై మా ఉసురుతీస్తున్న ఈ ఎన్నికల పద్ధతిని వ్యతిరేకిస్తూ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు ఆ పోతున్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్