కొనరావుపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల అటవీ ప్రాంతంలో కుక్కలు చుక్కల దుప్పుపై దాడి చేస్తూ వెంట పడగ పంట పొలాలోకిరావడంతో గమనించిన గ్రామస్తులు దుప్పిని కుక్కల భారీ నుండి రక్షించి అటవీ అధికారులకు అప్పగించినట్లు సర్పంచ్ మాట్ల అశోక్ తెలిపారు. కుక్కలు ఇటు ప్రజల పైన దాడి చేస్తూ అడవి జంతువులను కూడా దాడి చేస్తూ చంపేస్తున్నాయని కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
