Breaking News నేరాలు ప్రాంతీయం

పేపర్ కప్పుల్లో టీ తాగడం చాలా ప్రమాదకరం…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి, ఆరోగ్య నిపుణులు

287 Views

పేపర్ కప్పుల్లో టీ తాగుతే అనేక ఆనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య అధికారులు నిపుణులు చెబుతున్నారు.అనేక మందికి ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయ ఎల్లారెడ్డిపేట మండలంలో పలు హోటళ్ళ యజమానులు విచ్చలవిడిగా పేపర్ కప్పుల్లోనే టి విక్రయాలను సాగిస్తున్నారు
కొంతమందికి ఉదయాన్నే వేడివేడిగా టీ, కాఫీ తాగందే రోజు గడవదు. ఆఫీస్‌లో, రోడ్డు పక్కన బడ్డీకొట్టు ఎక్కడ పడితే అక్కడ టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. గతంలో టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో ఇచ్చేవారు. కాలంమారే కొద్దీ వాటి స్థానంలో డిస్పోజబుల్‌ పేపర్ గ్లాసులు వచ్చాయి. నేటి కాలంలో అనేక మంది టీ తాగడానికి పేపర్ కప్పులను ఎక్కువ శాతం వినియోగిస్తూంటారు. నిజానికి.. పేపర్ కప్పుల్లో టీ లేదా ఇతర వేడి ద్రావణాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయాన్ని ఇటీవల ఖరగ్‌పూర్‌ ఐఐటీ తాజా అధ్యయనాల్లో బయటపడింది. పేపర్ కప్పుల్లో రోజుకు మూడు సార్లు 100 మిల్లీలీటర్ల చొప్పున వేడి వేడి టీ తాగితే.. 75 వేల హానికరమైన మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించారు. ఈ విధంగా శరీరంలోకి చేరే ప్లాస్టిక్‌ క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలకు కారణమవుతుందని అధ్యయనంలో తేలింది.సాధారణంగా పేపర్ కప్పు హైడ్రో ఫోబిక్ ఫిల్మ్ పొరతో తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతర పదార్థాలతో కూడా పేపర్ కప్పులు తయారవుతాయి. టీ వంటి వేడి ద్రవాలను పేపర్ కప్పులలో పోయగానే దానిలో ఉండే ప్లాస్టిక్ పొర సులభంగా కరిగి అందులో కలిసిపోయి టీ ద్వారా శరీరంలోకి చేరుతుంది. అందువల్లనే వీలైనంత వరకు పేపర్ కప్పులలో టీ, కాఫీలు తాగడానికి దూరంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు స్టీల్, గాజు గ్లాసులను, మాంగాణి కప్పులు ను వినియోగిస్తే మంచిదని ఎల్లారెడ్డిపేట మండల ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ బాబు , డాక్టర్ స్రవంతి , మండల కేంద్రంలోని ఆశ్వీణీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి , పిల్లలు వైద్య నిపుణులు డాక్టర్ అమరేందర్ రెడ్డి వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు,

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *