- కోనరావుపేట: రిపోర్టర్ డి.కరుణాకర్/ ప్రతిమ
ఫౌండేషన్ సహకారం తో
ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ నగునూర్ కరీంనగర్ ఆధ్వర్యంలో మంగళవారం కొనరావు పేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని డాక్టర్ చెన్నమనేని వికాస్ డాక్టర్ దీప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ప్రతిమ ఫౌండేషన్ సేవలు అందిస్తున్నామని డాక్టర్ దావకాన మీ దర్వాజా దగ్గరకి వచ్చి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి అలవాట్ల, మంచి ఆలోచనలు, మంచి ఆహారం, ఈ మూడు చాలా ముఖ్యంగా ఉండాలని
పల్లెలలో చాల మంది మద్యపానం ,దుమపానం, అంబార్ వంటి చెడు అలవాట్ల వల్ల క్యాన్సర్ భారిన పడుతున్నరన్నారని పల్లెలలో చాలా మంది ఇలాంటి వ్యాధులకి ఎక్కువ గురవుతున్నారు. కావున ముందస్తుగా క్యాన్సర్ ని గుర్తించి చికిత్స అందిచాలన్నారు.
అందరి భాగస్వామ్యంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమౌతుందని, కరోనా వంటి విపత్కర సమయంలో రైతులు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.దేశానికి అన్నం పెట్టిన రైతన్నలకు అండగా ప్రతిమ ఫౌండేషన్ నిలుస్తుందని, ఇది వరకే కొనరావు పేట మండల కేంద్రం లో 2 ఉచిత అంబులెన్స్ లు ఇవ్వడం జరిగిందని ఇదే కాకుండా మహిళ సాధికారత కొరకై ప్రతిమ ఫౌండేషన్ పెద్ద పీట వేస్తుందని ప్రతిమ ఫౌండేషన్ ద్వార కుట్టు మిషన్లు, స్వయం ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. యువత కోసం ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నైపణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించడం జరిగింది అన్నారు.
ఈ క్యాంపు లో 683 మంది ఓపి చూడగా సాధారణ జబ్బులు, రక్త పరీక్షలు,మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష (మమ్మోగ్రాఫి ) , గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, ఎక్సరే పరీక్షలు ఉచితంగా నిర్వహించి 342 మందికి పలు రకాల వైద్య పరీక్షలు ఆరోగ్య రథం ద్వారాఅందించమన్నారు. తదుపరి వైద్య పరీక్షల కోసం 55 మందిని ప్రతిమ ఆసుపత్రి కీ రిఫర్ చేయడంజరిగిందని తెలిపారు.
అనంతరం డాక్టర్ చెన్నమనేని వికాస్ డాక్టర్ దీప మామిడిపల్లి గ్రామంలోని మహిళలకు, యువతులకు, పాఠశాల విద్యార్థినులకు ఉచిత సానిటరీ ప్యాడ్స్ మూడు నెలలకు సరిపడ అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భారతి నర్సయ్య,ఉప సర్పంచ్ రాంరెడ్డి, మాజి సర్పంచ్ లక్ష్మణ్, గోపాడి సురేందర్ రావు, పురుషోత్తం రావు, గొట్టే రామచంద్రం, అశోక్ రావు, వార్డు సభ్యులు,ప్రజలు , మహిళలు,ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
