ప్రాంతీయం

దేశాన్ని అవమానించిన రాహుల్ గాంధీ – బిజెపి పార్టీ

53 Views

దేశాన్ని అవమానించిన రాహుల్ గాంధీ –
BJYM జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోలిశెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారతదేశ ప్రజలను అవమానించేలా ప్రజలు ఇచ్చిన తీర్పును కించపరుస్తూ పాకిస్తాన్ మద్దతు దారు అమెరికా ప్రతిపక్ష శాసన సభ్యురాలు ఇల్హాన్ ఓమర్ ను కలిసి భారతదేశ కీర్తిని కించపరిచేలా వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్కు మద్దతు తెలిపిన ఆ నాయకురాలితో చర్చలు జరిపిన దౌర్భాగ్యుడు రాహుల్ గాంధీ అని అన్నారు అవసరం వచ్చినప్పుడు రిజర్వేషన్లు రద్దు చేస్తామని వ్యాఖ్యానించడం ఈ దేశ ప్రజల హక్కులను కాలరాయడమేనని, ఈ దేశంలో పేదల పట్ల దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తుందని తేటతెల్లమైందని అన్నారు. గత ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం బిజెపిపై అనేక తప్పుడు ఆరోపణలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన నిజ స్వరూప ఇది.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బిజెపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్