కొండపాక జప్తి నాచారం మధిర గ్రామమైన దోమలోనిపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు వారు పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు సోమవారం దుద్దెడ శివారులోని మహదేవ్ కాటన్ మిల్లుకు వెళ్లారు. పత్తిని తూకం వేసిన సమయంలో రైతులకు అనుమానం రావడంతో యాజమాన్యాన్ని నిలదీశారు. మిల్లులో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని విలేకరులకు తెలియజేప్పెందుకు పలువురు విలేకరులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న విలేకరులు రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేలా యాజమాన్యంతో మాట్లాడి వారికి రావాల్సిన డబ్బులను ఇప్పించారు. రైతుల పక్షంగా మాట్లాడినందుకు సూర్య దినపత్రిక రిపోర్టర్ బాల్ రెడ్డి ని కొండపాక పాక్స్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావ్ సభ్య పదజాలంతో దూషించి దాడి చేశారు .అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసిన వ్యక్తులను చట్టపరమైన చర్యలు తీసుకొని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ధలిత జర్నలిస్ట్ వర్కింగ్ అస్సోసియేషన్ గజ్వేల్ ఉపాధ్యక్షుడు పొట్ట అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడుల సంస్కృతి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అని, బుదవారం కొండపాక మండల రిపోర్టర్లు జాంజిరపు సంజీవ్ లు , నిమ్మ నర్సింహా రెడ్డి ని అసభ్య పదజాలంతో తిట్టడం విలేకరుల పై జరిగిన దాడులు స్వేచ్చా స్వాతంత్య్రానికి, ప్రత్రిక స్వేచ్ఛను హరించేల వున్నాయని అన్నారు. విలేఖరుల పై దాడులు చేయడం వలన వాస్తవాలను, వార్తల్ని ఆపలేరు అని, బెదిరింపులకు పాల్పడితే, దాడులకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. వార్త కథనాలపై ఏమైనా సందేహాలు వుంటే తెలపాలని, లేదా వాటిని ఖండించాల్సిన అవసరం వుంటుంది కానీ ఈ విధంగా భౌతిక దాడులు చేస్తూ, బెదిరింపులకు పాల్పడితే, విలేఖరుల ను దుషిస్తే ఊరుకునేది లేదని, జర్నలిస్టుల పై దురుసుగా ప్రవర్తించిన వారి ఇంటిని ముట్టడి చేస్తామని తెలిపారు. జిల్లాలోని పోలీస్ యంత్రాంగం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, దాడులు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజంలో ఇలాంటి దాడుల సంస్కృతికి అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో ప్రజలు బానిసగా పరిస్థితి ఏర్పడుతుందని, నిజాలు బయటకి వెల్లడించే అవకాశం ఉండదని అన్నారు. జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను యావత్ ప్రజానీకం ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆహార్నిషలు సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉండాలని అన్నారు.