తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అందత్వ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించినట్లు, దేశంలోనే ఆదర్శవంతమైన పథకమని కోనాపూర్ సర్పంచ్ పంచమి స్వామి,ఉప సర్పంచ్ అందే రాజిరెడ్డి అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండలం కోనాపూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పౌరులందరికీ కంటి పరీక్షలు, ఉచితంగా అద్దాలు, మెడిసిన్స్ అందజేస్తారని, తీవ్రమైన వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణ అందత్వ నిర్మూలన గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డా. ఇంద్రమోహన్, ఆప్తోమెట్రిస్ట్ రమేష్, డిఈఓ అనిత, పంచాయతి సెక్రటరీ రవీందర్, బిఆర్ఎస్ గ్రామ అద్యక్షుడు చిటుకుల స్వామి, వార్డు సభ్యులు బాలస్వామి, ఏఎన్ఎం మార్తా, ఆశా వర్కర్ రాణి, రేణుక తదితరులున్నారు.