ప్రాంతీయం

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

72 Views

సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

మాజీ సర్పంచ్ తీగుళ్ల సత్యం 

సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 25

జగదేవ్పూర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీ లలో ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అంతాయా గూడెం మాజీ సర్పంచ్ తిగుల్ల సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వం అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా ఇంకా బిల్లులు చెల్లించకపోవడం తాజా మాజీ సర్పంచులను త్రివ మనోవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు. పెండింగులు ఉన్న బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

2019 నుంచి 2024 వరకు గ్రామాల అభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్‌ బిల్లులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కావాలని విడుదల చేయడం లేదని, తాము పెట్టిన డబ్బు రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పెండింగ్‌ బిల్లుల చెల్లింపు విషయమై నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి పలు మార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో లోగడ చేసిన పనుల పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో గత ప్రభుత్వ ఆదేశానుసారం వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్‌ యార్డ్‌లు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వలు, వీధిలైట్ల నిర్వహణ, పారిశుధ్యం, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు తదితర పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ఆయా పనులకు ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో అప్పటి సర్పంచ్‌లు లక్షల రూపాయలు అప్పులు చేసి పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గత, ప్రస్తుత ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడం సరికాదని పేర్కొన్నారు.

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల బిల్లులను తక్షణమే మంజూరు చేసే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

No Slide Found In Slider.

Poll not found