జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పురాతన శివాలయంలో శుక్రవారం శివపంచాయతనము నవగ్రహాలు, ధ్వజ స్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఆలయాన్ని పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేద పండితుల మధ్య ప్రతిష్టాత్సోవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. శుక్రవారం ఉ: 9.00 గంటలకు గణేశ – గురు ప్రార్ధన శాంతిమంత్ర పఠనము, పంచగవ్యప్రాశనము దీక్షాధారణ-ఋత్విగ్వరణం అఖండదీవస్థావన. అంకురారోపణం, మంటవ దేవతాస్థావనం. ప్రధానకలశస్థాపన ప్రతిమాశోధనము మంగళహారతి తీర్థ ప్రసాద వితరణ. సా: 5.30 గంటలకు యాగశాల ప్రవేశం, కుండ సంస్కారం, అగ్నిప్రతిష్టాపనం, గణపతిహావనం, జలాధివాసం ప్రదోషపూజ, నీరాజన సేవ, మంత్రపుష్పం, ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ యాదవరెడ్డిలు మాట్లాడుతూ ఆదివారం ఉ 8.00 గంటల నుండి గణపతి పూజ, స్థాపిత దేవతాపూజ, పోవనము, గర్త సంస్కారము ఉ: 9.42 గంటలకు విగ్రహప్రతిష్టాపనము బలిహారణము. పూర్ణాహుతి కలశోద్వాసన విశేషపూజ, శివపార్వతుల కళ్యాణం మహాదాశీర్వచనము తీర్ధప్రసాద వితరణము, ఆదివారం అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటీసి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కమిటీ సభ్యులు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.