జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శెనగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎంపీపీ బాలేశం గౌడ్ పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి ,మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శెనగలను పండించిన రైతులు దళారుల బారిన పడకుండా క్వింటాల్ రూ.₹5’335/- మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్,ఎంపీటీసీ కవిత, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కో అప్షన్ ఎక్బల్ , మండల నాయకులు, సర్పంచ్ లు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.