గజ్వేల్ మండలం కోమటి బండ గ్రామం లో కిమ్స్ హాస్పిటల్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు…
ఈ వైద్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణురాలు శ్రీలత మరియు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ సంతాన లేనివారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపణీ చేశామన్నారు, గర్భిణీలకు స్కానింగ్,రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. రక్తపోటు,డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు కూడా రక్త పరీక్షలలు,మూత్ర పరీక్షలు నిర్వహించారు.అలాగే గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులకు ECG పరీక్ష లు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు..కిమ్స్ హాస్పటల్ గజ్వేల్ వారు నిర్వహించిన ఉచిత మెగా సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కోమటిబండ గ్రామ సర్పంచ్ తూం శేఖర్ పటేల్,గ్రామ వార్డ్ సభ్యులు,నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
